
హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలోని గ్రామ,పట్టణ,మండల కమిటీలను రద్దు చేసినట్లు నియోజక వర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు బుధవారం ప్రకటించారు. నియోజక వర్గం పరిధిలో గతములో వున్న గ్రామ,పట్టణ,మండల కమిటీలు తక్షణం రద్దు పరిచినట్లు,నాయకుల,కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో అన్ని మండల,పట్టణ,గ్రామాల నూతన అధ్యక్ష,కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.