Sweet Corn for Diabetics: Safe or Not?
డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినవచ్చా?
డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ పేషెంట్స్ తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీపి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే, దీని వల్ల ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. శీతాకాలంలో చాలా మంది స్వీట్ కార్న్‌ను తినడానికి ఇష్టపడతారు. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? స్వీట్ కార్న్ తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో, చాలా మంది స్వీట్ కార్న్‌ను ఉడికించి ఉప్పు, కారం వేసుకుని తింటారు. కొంతమంది దీనిని సలాడ్లు, కూరగాయలలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే రుచికరంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్లు బి1, బి2, బి3, బి6, ఎ2 వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. శరీర పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి.
