డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు
దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కేంద్రం నుండి శాయంపేట ఆత్మకూరు రోడ్డు మార్గం వేశారు కానీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు అంత రోడ్డుపైనే ప్రవహిస్తూపోతుంది.మురుగు నీరు నిల్వ ఉండి వాసన వెదజల్లుతుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి రోగాల బారినపడాల్సి వస్తుందోనని నివసించే ఇంటి ముందు మురుగునీరు ఉన్నప్పుడు తమ తలరాతలు ఇంతేనని పగలు రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నడంతో మలేరియా ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరంతరాయంగా రోడ్డుపైన ప్రవహిస్తున్న మురికి నీరు ఇళ్లలో మార్గంలో నీరు నిల్వ ఉండి దోమల వ్యాప్తి వృద్ధి చెందుతుంది. అధికారులు ఇదే రోడ్డు కూడా వెళ్తున్న పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు అంటున్నారు. దీనితో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డుపై రోజుల తరబడి నీరు ప్రవహించడంతో దోమలు వ్యాప్తి చెందుతాయని ఫలితంగా సమీప ఇండ్లలో ఉంటున్న వారు తీవ్ర అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా వైపల్యం చెందడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.