
వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి లో బీసీ ఎమ్మెల్యేలు కీర్తిశేషులు డాక్టర్ బాలకృష్ణయ్య అయ్యప్ప జయరాములు వర్ధంతిలు జయంతులు నిర్వహించరా అని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లను ప్రశ్నించారు కీర్తిశేషులు జయరాములు వర్తంతి సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆహ్వానం పంపిం చి న వారు పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు ఒక నాయకుడు జయ రాములు వర్ధంతి సందర్భంగా పూలమాలలు నివాళులు అర్పించడానికి వస్తే ఎందుకు వెళ్లావని చివాట్లు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ ఎమ్మెల్యే అంటే అంత చులకన ఎందుకని అన్నారు నిన్న జరిగిన ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి కి నివాళులర్పించిన వారు జయరాములు వర్ధంతి లో సంద
పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు జయరాములు పేరుతో ఉన్న గెస్ట్ హౌస్ ని మార్చడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు అఖిలపక్ష ఐక్యవేదిక అందరూ ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను సమానంగా చూస్తుందని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో బీసీల ఎమ్మెల్యేలను చులకనగా చూడడం విడ్డూరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జయ రాములు వర్ధంతి రోజున బీసీ సదస్సు విజయవంతమైనందుకు వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు