
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఇట్టి ప్రచార కార్యక్రమానికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమా మంత్రి కె టి రామారావు సిరిసిల్ల నియోజకవర్గం నుండి గెలుపొందిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పరిచారని రానున్న ఎన్నికల్లో మళ్లీ మన మంత్రి కేటీరామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే తెలంగాణ ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ మానస రాజు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ కోడి అంతయ్య మండల అధ్యక్షుడు రాజన్న పార్టీ సీనియర్ నాయకులు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మీరాలభాస్కర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు