మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సులు
ముత్తారంలో పోలీస్ కళాబృందం ప్రచార కార్యక్రమంలో
మంథని సిఐ గడిగోప్పుల సతీష్
ముత్తారం ఎస్ ఐ మధుసూదన్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
సైబర్ నేరాలను అరికట్టేందుకు మహిళలపై అత్యాచారాలు జరగకుండా వారికి భద్రత కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలపై రామగుండం సిపి రీమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందాలచే గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్టు మంథని సిఐ గడిగోప్పుల సతీష్ తెలిపారు. శుక్రవారం రాత్రి ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద పోలీస్ కళాబృందం వారు నిర్వహించిన సదస్సులో సీఐ పాల్గొని మాట్లాడుతూ షీ టీం లపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘయిత్యాలు మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను ఉత్తేజపరిచే విధంగా కళాబృందం వారు పాటలతో ఆకర్షించుకున్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా ఫోను చేసి ఓటిపి నంబర్లు కానీ ఏ సమాచారం అడిగిన చెప్పవద్దని చెప్పినట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయని తెలిపారు కొత్త వ్యక్తులు ఫోను చేసినట్లయితే పోలీస్ శాఖకు సమాచారం అందించినట్లయితే వెంటనే ఆ నంబర్ను ట్రేస్ చేసి వారిని కనుక్కుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పోలీస్ కళాబృందం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.