తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో ఏఎంసి చైర్మన్ స్థానిక ఎంపిటిసి బైరవేణి రాము ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన అభివృద్ధి ప్రదాత మన మంత్రి కేటీ రామారావు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి అధికారం చేపట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమానికి ఎంపిపి పడిగల మానస రాజు డైరెక్టర్ దేవేందర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు