Call to Uphold Ambedkar’s Ideals in MetpallyCall to Uphold Ambedkar’s Ideals in Metpally
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలీ
మెట్ పల్లి నేటి ధాత్రి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ సమీపంలో గల అంబేద్కర్ పార్కులో అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరంమెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం అమలు అవుతుందని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ విషయమని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ పాలన సుభిక్షంగా జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన హక్కులు కల్పించబడ్డాయి అన్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగం సక్రమంగా అమలు అయ్యే విధంగా సహకరించాలని కోరారు.
