Telangana Bandh
బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు
ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
