
బెల్లంపల్లి నేటిధాత్రి :
సిపిఐ శత జయంతి ఉత్సవాల భాగంలో బెల్లంపల్లి పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ బొల్లంపూర్ణిమ ఎగురవేసినారు.ఈ సందర్భంగా కామ్రేడ్ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ 26 డిసెంబర్ 1925 న ఆవిర్భా వించింది. నాటినుండి ఈ దేశంలో నేటి వరకు భారత స్వాతంత్ర ఉద్యమంలో పీడిత ప్రజల హక్కులకు సంఘటిత అసంఘటిత కార్మికులకు యూనియన్ నిర్మించి కార్మికుల హక్కులకు చట్టాలను ఇప్పించడం తో పాటు దున్నేవానికి భూమి కావాలని నైజాముకు జమీందారుల జులుం కు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు చేసి 4600 మంది కామ్రేడ్స్ లు అమరులైనారు అనేక కష్టనష్టాలను అనుభవించుచు ఇప్పటి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ నే ఉన్నది. పార్టీ శ్రేణులంతా పార్టీ విస్తరించుటకు పార్టీని పట్టణంలోని అన్ని వార్డులలో శాఖల నిర్మించుకోవాలని పిలుపునిస్తూ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగం పైన దాడి చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కాలని చూస్తుంది. కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు కోడులకు మారుస్తూ రైతు చట్టాలను మారుస్తూ రైతు ఉద్యమాలను అణచి వేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలని ఇందిరమ్మ ఇళ్ళను అర్హులైన అందరికీ మంజూరు చేయాలని రైతులకు కౌలుదారులకు రైతుబంధు ఇవ్వాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ అక్క పెళ్లి బాబు, బొంతల లక్ష్మీనారాయణ, గుండా చంద్రమాణిక్యం, బియ్యాల ఉపేందర్, పట్టణ సహకార దర్శి కొంకుల రాజేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు గుండా సరోజ పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్ పుట్ట శ్రీనివాస్ రత్నం రాజం బొల్లం తిలకంబెద్కర్ బొంకూరు రామచందర్ దాసరి అనిల్ తిప్పారపు శంకరయ్య స్వామిదాస్ ఉప్పుల శంకర్ సమ్మయ్య కే నారాయణ శంకర్ గౌడ్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.