
ఘనంగా సి.నా.రే జయంతి వేడుకలు
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో మంగళవారం తెలుగు కవి సి.నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ సినారే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక కవితలు, పాటలు, వ్యాసాలు రచించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
సినారె రచించిన విశ్వంబర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం పొందాడన్నారు. 1970లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.