https://epaper.netidhatri.com/
`చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం.
` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు.
`దిల్ రాజుకు దిల్ లేదంటూ గతంలోనూ కథనాలు.
`దిల్ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు.
`బిఆర్‌ఎస్ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్!
`కాంగ్రెస్ రాగానే కొత్త పైత్యం షురూ!
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి అడ్రస్ లేకుండాపోయిన వారున్నారు. అయినా సినీ తరం ఎప్పుటికీ తరంతరం..నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం..ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం.. అలా నిండా మునిగినోళ్లే అనేకం. .అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొమని పెద్దలు చెప్పినట్లే సినిమా నిర్మాణం ఒక జూదం…సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం.. ఇతరలు దృష్టిలో వ్యాపారం.. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం…అయినా దాన్ని ఫ్యాషన్ అనే అనుకుంటారు..ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగులుతుంది. కాకపోతే తమకు తెలిసిందిన సినిమా మాత్రమే చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరే…ఓడిన వారే ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం. కాసుల ప్రపంచం..కళ్ల నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరుగెత్తిస్తున్నా వాటిని కూడ లేక్క చేయకుండా బతికే ఏకైక ఆశా జీవి.. సీనీ జీవి…నిర్మాత..! నటులౌదామని వచ్చి దర్శకులైనవారున్నారు. నిర్మాతలైనవారు వున్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి. ఇప్పుడు వ్యాపారం కల్పవల్లి. కాలం మారుతోంది. సినిమా రూపం మారుతోంది. పెద్ద తెరమీద నుంచి బుల్లి తెరదాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తోంది. అయినా దాని రాజసం దానిదే…సినిమా అంటే సినిమానే…అరచేతిలో పట్టుకొని బొమ్మచూసినా, తాడి చెట్టంత బొమ్మను తెరమీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీవైభవ కార్మగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్ రాజు..నిజంగా దిల్ వున్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సీనీ మకుటం లేని నిర్మాతలకు రారాజు…
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా! సీమాంధ్ర సినిమా!! అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా, సీమాంద్ర సినిమా వేరువేరే. ఈ రెండు కలిపినట్లు కలిపి, నటించి, తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండు గుత్తగా గంప గుత్తను చేసుకొని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందినవాళ్లే… అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగుసినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్ రాజుకు ముందు..దిల్‌రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంద్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరుకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా..పాటలా? అంటూ హేళన చేశారు. ఎగతాలి చేసిన వారున్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా, రాకుండా చూసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిని సందర్భంలో బతికాని, ఇప్పుడు హాయిగా ఊరిపి పీల్చుకుంటూ, నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆదిపత్యం ఎలా వుండేదో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్ కవి గాయకుడుని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా? అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వ్యధని, గర్భశోఖాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ లాంటి కవిని కబ్బోర్డులో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంద్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్ రాజు..తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్ రాజు మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు.
పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు, గిన్నిస్ రికార్డులు సొంత చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజ వనికిపోతున్న సమయంలో తెలుగు సినిమాను నేను ఆదుకుంటాను..నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం..తెలుగు సినిమాకు వరం..దిల్ రాజు ప్రొడక్షన్. ఒక దశలో సినిమా అంటేనే ఆడమ దూరం నిర్మాతలు పరుగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాకు ఊపిరిపోసి, తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్ రాజు. అయితే పైకి సంబురం వ్యక్తం చేస్తూ, ఎప్పుడు దిల్ రాజు పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్లు కూడ చాలా మంది వున్నారు. అయితే పడి లేవడం దిల్ రాజుకు కొత్త కాదు. పడి లేవడం తెలిసిన దిల్ రాజు ఒక్కసారి పడితే పదిసార్లు లేచేంత బలం కూడదీసుకొని ముందుకు విచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. నవ్విన నాప చేను పండినట్లు, దిల్ రాజు ఎక్కడ దొరక్కపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్లు బైర్లు కమ్మేంత వెలుగు చూసిన నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు నిజంగా దిల్ వున్న రాజే కాదు..ఎంతో ధైర్యం వున్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు.. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా ధియేటర్‌లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత వుండేది. రికార్డులను తిరగరాసేంది. సినీ ప్రభంజనాన్ని సృష్టించేది. కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బుకోసం దిల్ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కాని సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని కోసమైనా సీమాంధ్ర చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే మూడు రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్ హిట్ సినిమాలంటే మూడు వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు. కనీసం ఓటీటిలో పేరొస్తే చాలనకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి వున్నంత కాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకొని బలగం సినిమా చూశారు. ధియేటర్లకు బండ్లు కుట్టుకొని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్ రాజు మీద లేని పోని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమంధ్రకు చెందిన వాళ్లు విపరీత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్‌రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు…ఎవరికీ స్టార్ డమ్ నిర్మాత లేకుండా రాలేదు. అయినా రెండు రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు…ఆ ఒక్కడు దిల్‌రాజు మాత్రమే..ఎనీ డౌట్?