– అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి….
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోన ముస్లిం ప్రార్థన మందిరంలో రంజాన్ వేడుకలు
*పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముస్లిం పెద్దలు అన్నారు *

*ఈద్-ఉల్-ఫీతర్ (పవిత్ర రంజాన్) పర్వదినం పురస్కరించుకొని ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు మైదానంలో ముస్లిం సోదర అందరూ ప్రార్థనలు చేశారు ముస్లిం ప్రార్థన గురువు మసీద్ సదర్ ఎండి యూసుఫ్ పాషా ముఖ్య అతిథులుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ
*వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటి రంజాన్ అని కొనియాడుతూ చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌబ్రతృత్వ గుణాలు పంచుతుందని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్లింలకు పెద్దపేట వేస్తుందని అన్నారు. అల్లా దయతో ఈ పండుగ మానవాళికిచ్చే గొప్ప సందేశమని అన్నారు.