
డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాల్వంచ టౌన్.గణపతి నవరాత్రి ఉత్సవాల మండపాల్లో అన్నదానంతో గణపతి సాక్షాత్కారం లభిస్తుందని డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పాత పాల్వంచలో కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు బత్తుల మధుచంద్ ఎం.బి.యూత్ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి ఉత్సవ మండపంలో ప్రముఖ అర్చకులు కందాల ఆనంద్ కుమారా చార్యులుప్రత్యేక పూజలు నిర్వహించారు.సుమారు 3 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమాన్ని కొత్వాలతో పాటు పట్టణ బాణాల ఎస్ఐ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా *
కొత్వాల మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్నారు. అన్నం పర:బ్రహ్మ స్వరూపం అన్నారు. అందరూ తమ సంపాదనలో కొంత దానాలకు ఉపయోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో *పట్టణ పోలీస్ ఎస్ఐ బాణాల రాము, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, అధ్యక్షులు బత్తుల మధుచంద్,గంధమల్ల రాజయ్య, పుప్పాల కృష్ణ,కిలారి సుజాత, బత్తుల మంగా, ఆవుల వీరమ్మ, బర్ల ప్రమీల, అర్చన, గుగులోత్ మంగ్య, కళావతి,వానపల్లి రామ, కోసూరి భవాని, కొండపల్లి రజిత, మాచవరపు లక్ష్మి, యూత్ సభ్యులు కంచర్ల రామారావు, బర్ల అన్వేష్, బట్టు సాగర్, బాలా, బండ్ల ప్రశాంత్, రఘు, శ్రీను,జయంత్,మంగ,మనోజ్,మణికంఠ,ఆదేశ్,గ్రామ పెద్దలు బర్ల పాపారావు,అగ్ని మండల భాస్కర్,పాశం నాసరయ్య,ముత్యాల కోటేశ్వరరావు,లెనిన్,కోటి, మండిగ రమేష్, గూడపాటి ప్రవీణ్, కొండపల్లి నాగరాజు, బండ్ల పవన్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.