నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ బృందంతో నివాళులు అర్పించారు. చినిగిన చొక్కా అయినా తొడుక్కో
కానీ మంచి పాఠ్య పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు ఆలోచనను ఆచరణలో పెడుతూ ప్రవాస భారతీయ వాసవి సంఘం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు దాదాపు 30 వేల రూపాయల విలువగల విలువైన కథల పుస్తకాలను విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరిగింది. చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించే విద్యా కార్యక్రమాలను,ప్రయోగాత్మక విద్యను,సోషల్ మీడియాలో చూసి ప్రభావితులై ముఖ పరిచయం కూడా లేకుండా వారు ఈ పుస్తకాలను పాఠశాలకు కొరియర్లో పంపించడం జరిగింది.ఈ సందర్భంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం, జాతీయ విద్యా దినం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వాసవి సంఘం పంపించిన పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.ఈ పుస్తకాలతో గ్రంథాలయాన్ని విద్యార్థులకు వాడుకలోకి తేవాలని అనుకుంటున్నట్టు, ఈ రోజుల్లో సెల్ ఫోన్ లకు అలవాటు పడిన విద్యార్థులు పుస్తకాలకు దూరమై పఠనా శక్తిని కోల్పోతున్నారని ప్రవాస భారతీయ వాసవి సంఘం వారు అందించిన పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని సోషల్ మీడియా ద్వారా మా పాఠశాల కార్యక్రమాలను చూసి ఆకర్షితులై, గ్రంధాలయం నిర్వహణకు పుస్తకాలను అందించిన ప్రవాస భారతీయ వాసవి సంఘానికి ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ధన్యవాదాలు తెలియజేరు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచు రాజకుమార్, బత్తుల రవీందర్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.