ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ
నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి :
ఎండల ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో బుధవారం నర్సంపేట ఆర్టీసీ డిపో ఆవరణలో డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం ప్రయాణికులతో రద్దిగా డ్యూటీ చేస్తున్నారు వారికి మధ్యాహ్నం సమయంలో కొంత ఉపశమనం కొరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఇది వేసవి కాలం రోజు వారిగా అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ, డిపో సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.