#ములుగు జిల్లా వైపు బస్సుల సంఖ్య పెంచాలి
#ప్రయాణికులకు తలనొప్పిగా మారుతున్న ములుగు ప్రయాణం
#ములుగు ప్లాట్ ఫామ్ ముందు విద్యార్తులు, విద్యార్థి సంఘాలు, మరియు ప్రయాణికుల నిరసన
#పట్టించుకోని అధికారులు
#ట్విట్టర్ ద్వారా మంత్రి పొన్న ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ కి వినతి పత్రం
హనుమకొండ, నేటిధాత్రి:
అనంతరం ఏబి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…. ములుగు వయా మల్లంపల్లి ఎటునాగారం తాడ్వాయి వెంకటాపురం పలు గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థులు మరియు ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్దదిక్కైనా హక్నకొండ జిల్లా కేంద్రంకు ప్రజలు బస్సు ప్రయాణం మీద ఆధారపడి వస్తున్న తరుణంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతం నుండి 8 గంటల సమయంలో ప్రయాణికులు మరియు విద్యార్థులు బస్సుల కోసం అధిక సంఖ్యలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది అని ఇట్టి విషయంపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఫలితం శూన్యం ఇప్పటికైనా ఆర్టీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ స్పందించి ములుగు వైపు బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులను మరియు ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.