
Two-wheeler parking
పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు
నీరుకుళ్ళ బస్టాప్ లలో దర్జాగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్
నిలవడానికి నీడ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు
నేటిధాత్రి, ఆత్మకూరు.
హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద.., వరంగల్ నుండి ములుగు కు వెళ్లే ప్రధాన రహదారి నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద రహదారికి ఇరువైపుల ఉన్న బస్ స్టాపుల్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్న తీరు. ప్రయాణికుల కోసం ప్రజలు నిల్చోవడానికి ఏర్పాటు చేసిన బస్ స్టాపుల్లో దర్జాగా ద్వి చక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తున్న వాహనాదాలు. దీంతో ప్రజలు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే వర్షాకాలం ప్రయాణం చేస్తున్న ప్రజలు నీడ కోసం నిలబడే బస్ షెల్టర్ లలో వాహనాలు పార్కింగ్ చేయడం సమంజసం కాదు అని ప్రయాణికుల ఆవేదన. స్థానిక పోలీసు అధికారులు స్పందించి బస్ స్టాప్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాల్సిందిగా ప్రయాణికుల విజ్ఞప్తి.

సదరు బస్ స్టాప్ దగ్గర వాహనాలు పార్కింగ్ చేయొద్దు అని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.