Burrakayala Gudem to Be Developed as Model Village
బుర్రకాయల గూడెం ఆదర్శ గ్రామాంగా తీర్చిదిద్దాలి.
— మాజీ జెడ్పిటిసి శివ శంకర్ గౌడ్.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బురకాయగూడెంను ఆదర్శ గ్రామంగా నూతన సర్పంచ్ తుమ్మల సంపత్ తీర్చిదిద్దాలని మాజీ జెడ్పిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ పేర్కొన్నారు. బుర్రకాయల గూడెం గ్రామ సర్పంచ్ గా తుమ్మల సంపత్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో మాజీ జెడ్పిటిసి ని సర్పంచ్ సంపత్ సాదరంగా పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథిగా పిలవడంతో పెద్ద మనసుతో గ్రామానికి వెళ్లి నూతన సర్పంచి సంపదను శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామ నూతన సర్పంచ్ సంపత్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలందరూ మాజీ జెడ్పిటిసి శాలువాలతో సన్మానించి తమకు సలహాలు సూచనలు అందించాలని కోరారు. మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో ఉంటూ గ్రామ అభివృద్ధికి అందరూ పాటుపడాలని సూచించారు. చిన్న గ్రామపంచాయతీని అందరు కలిస్తే అభివృద్ధి పథంలో మండలంలో ముందంజలో తీసుకెళ్లవచ్చనాని అన్నారు. అలాగే బుర్రకాయల గూడెం గ్రామాన్ని నా రాజకీయ జీవితంలో మర్చిపోను అని, ఎప్పుడు ఏ సమస్య ఉన్న మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరించే వరకు పాటుపడతానని పేర్కొన్నారు. మీరందరూ నాపై చూపించే ఆదరాభిమానాలను ఇలానే చూపించాలని, మీకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని ఈ సందర్భంగా శివశంకర్ గౌడ్ నూతన పాలకవర్గం కు గ్రామస్తులకు సూచించారు. మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఏనాడు మర్చిపోరని, మంచి ప్రజాసేవ పరిపాలన చేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
