“March Heatwave Hits Hard”
మండుతున్న ఎండలు…. మండుతున్న మంటలు..
◆”-: మార్చిలోనే పెరిగిన తీవ్రత
◆”-: 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
◆”-: కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు
◆”-: పరీక్షల కాలంలో సతమతమవుతున్న విద్యార్థులు
◆”-: 12 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
◆”-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఫిబ్రవరి వరకు చలి తీవ్రతకు గజగజలాడిన జనం ఇప్పుడు భగ భగ మండే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఇప్పుడు మరింతగా ఎండల ప్రభావం పెరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉద యం నుండే భగ..భగమంటూ వస్తున్న ఎండలను చూసి ప్రజలు జంకుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత రికార్డు స్థాయికి ఎండలు చేరుకునే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు.

ఎండల తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతుం ది. గతం కంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం మార్చి నెలలోనే ఉన్నా ఎండల వేడి మండిపోతుంది. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుం డా రోజంతా భానుడి ప్రతాపం భగ భగమంటున్నది. పెరిగిపోతున్న ఎండలకు వృద్ధులు, చిన్నారు లు ఎక్కువగా విలవిలలాడుతున్నారు. ఒక్కసారిగా ఎండవేడిమి పెరిగిపోవడంతో ఉక్కపోతలు ప్రజలకు గుక్క తిప్పనీయడం లేదు. జిల్లాలో మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే నెలలో వారం రోజుల ఎం డలను పరిశీలిస్తే..ఉష్ణోగ్రతల తీవ్రత తెలిసిపోతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు కరెంట్ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక గ్రామాల్లోనూ కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి…

ఉదయం నుంచే ఎండ వేడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయలను అనుసరిస్తున్నారు. టోపీలు, హెల్మెట్లు, మాస్క్లు, రుమా ళ్లు ధరించి జనం ఉపశమనం పొందుతున్నారు. రోడ్ల పక్కల నీడనిచ్చే చెట్లు కనిపిస్తే చాలు సేదతీరుతున్నారు. కొత్త కుండలను తీసుకొని చల్లని నీటితో ఉపశమనం పొందుతున్నారు. ఎండలు పెరుగుతున్నందునా కొత్త కుండల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, పశు పక్షాదుల పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఉండే కోతులు ఎక్కడ నీరు కనిపించినా వాటిలో దూకడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే పశువులు కూడా ఆయా గ్రామాల చెరువుల్లో ఎండలకు తాళలేక సేద తీరుతున్నాయన్న అభిప్రాయం ఉంది.
పరీక్షల కాలంలో..
ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య పరీక్ష నిర్వహణ ఉంటుంది. విద్యార్థులంతా ఇతర ప్రాంతాల నుంచి సెంటర్లకు వచ్చి వెళ్త్తూ ఉంటారు. బస్సులు, ఆటోలు, మోటర్ సైకిళ్లపై ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇలా ఎండలు పెరగడం వల్ల విద్యార్థులు సహితం ఇబ్బందులకు గురవుతున్నారు.
జాగ్రత్తలు అవసరం..
ఎండల తీవ్రతను బట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎండలకు ఇబ్బందులు పడకుండా ఉండాలం టే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. పిల్లలు ఎక్కవ సమయం ఎండలో ఆడకూడదు. ఎండలోఎక్కువ తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడం శ్రేయస్కరం. ఎక్కువ నీరు తాగడం.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడంలాంటివి చేయాలి. జీన్స్లాం టి దుస్తులకు దూరంగా ఉండి…తేలికైన వస్ర్తాలను ధరించడంవల్ల ఉపశమనం లభిస్తుంది. రోజు రెండు, మూడుసార్లు చల్లనీళ్లతో స్నానం చేయించడం పిల్లలకు మరింత శ్రేయస్కరంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలతో పాటు కలుషిత నీరు, పరిశుభ్రత లోపం కారణంగా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య ఏరియా ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ సూచిస్తున్నారు. “విశాల తెలంగాణ” తో మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
“ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య”
