* 18న ముఖ్యమంత్రి కి అభినందన సభ
– క్షత్రియ సేవా సమితి
ఖైరతాబాద్; క్షత్రియ కులస్తులకు భవన నిర్మాణం కోసం హైదరాబాద్ నగరంలో స్థలాన్ని కేటాయించాలని క్షత్రియ సేవా సమితి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
.. సేవా సమితి అధ్యక్షుడు పర్చోర్ల నాగరాజు మాట్లాడుతూ.. 1961 సంవత్సరంలో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం సేవా దృక్పథంతో పేదలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందిస్తున్నట్టు తెలియజేశారు. క్షత్రియ సామాజిక వర్గంలో 70 శాతం పేదలు ఉన్నారు అని, వారి అభ్యున్నతి కొరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి తాము పని చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమ బాధలు విన్నవించామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసిన రెండు వినతులను సామరస్యంతో విని కచ్చితంగా చేస్తాము అని హామీ ఇచ్చారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పేరు మీద క్షత్రియ భవనానికి స్థలం కేటాయించడం, తెలంగాణలో అన్ని కులాలకు ఏర్పాటు చేసిన విధంగానే క్షత్రియులకు కూడా క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు అంశాలు ఉన్నాయని అన్నారు. ఆగస్టు 18న గచ్చిబౌలి, జి ఎం సి బాలయోగి ఇండోర్ స్టేడియం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రఘురామరాజు, వెంకటేశ్వరరాజు,కోశాధికారి వెంకటేశ్వరరాజు, భూపతి రాజు రాజేంద్ర రాజు,రామకృష్ణ రాజు, జగపతి రాజు, గడి రాజు మూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు