కార్మిక సమస్యల పరిష్కార వేదిక సిఐటియు.
సిఐటియు లో చేరిన పెయింటింగ్ వర్కర్స్.
కారేపల్లి నేటి ధాత్రి
కార్మికుల పరిష్కార వేదిక సిఐటియు అని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ముదాం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం కారేపల్లి బాగం రామ నర్సయ్య భవన్ లో కేలోత్ రవి అధ్యక్షతన జరిగిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పెయింటింగ్ వర్కర్స్ సిఐటియులో చేరారు వారికి సంఘం సభ్యత్వాలు ఇచ్చి సిఐటియు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ 20 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కార్మికులకు బీమా సౌకర్యంను సాధించుకోగలిగామన్నారు. సిఐటియు మార్గదర్శకంలో కార్మికులు తమ హక్కుల కోసం చేసే పోరాటాలతో పాటు పని ప్రదేశంలో జరిగే సమస్యల పరిష్కారంకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. భవన నిర్మాణ రంగంలో 56 విభాగాలకు చెందిన కార్మికులు ఉన్నారని వారందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను లబ్ధి చేకూరాలని సిఐటియు ఆకాంక్ష అని అన్నారు. కేంద్రంలోని బిజెపి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని కార్మికుల హక్కుల కాలరాయటానికి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. సిఐటియులో చేరిన ప్రతి కార్మికుని కి అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దోనోజు లక్ష్మణాచారి మేడికొండ నాగేశ్వరరావు మండల అధ్యక్ష కార్యదర్శులు కే లోతు రవి శనగ రాంబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ కే నరేంద్ర నాయకులు ముక్కా సీతారాములు ఎస్ శివ తదితరులు పాల్గొన్నారు.
పెయింటర్ మండల కమిటీ ఎన్నికల్లో
పెయింటర్స్ యూనియన్ (సీఐటీయు) మండల అధ్యక్షులుగా ఎస్ శివ కార్యదర్శిగా ఎస్కే పాషా ఉపాధ్యక్షులుగా బీ సుమన్ సహాయ కార్యదర్శిగా సుదర్శన్ కోశాధికారిగా ఈ ప్రవీణ్ కుమార్ కమిటీ సభ్యులుగా పీ అనంత రాములు వై వీరేందర్ డేగల రాంబాబు వడ్లకొండ సాంబశివరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్లు బిల్డింగ్ వర్కర్లు పాల్గొన్నారు.