
గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకర్రావు పేట గ్రామానికి చెందిన గోలి చుక్కన్న కు చెందిన పాడి గేదె మేత మేసుకుంటూ పోయి ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.95 వేల రూపాయలు వరకు విలువ ఉంటుందని బాధితుడు అన్నారు…. జీవనోపాధి కోసం పెంచుకున్న గేదె ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె విద్యుత్ అధికారులు అమర్చక పోవడం వలన గేదె మృతి చెందడం పట్ల మాకు నష్టపరిహారం చెల్లించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, ప్రభుత్వం తరఫున తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండటం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వెంటనే కంచె ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.