రైతులను మోసం చేస్తున్న ఐకెపి రైస్ మిల్లర్స్ యజమానులు
పొన్నం భిక్షపతి గౌడ్
బహుజన్ సమాజ్ పార్టీ
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ అనంతరం మాట్లాడుతూ…. టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి రేగొండ మండలాల కేంద్రాలలో నిర్వహిస్తున్న ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరు తరుగు పేరుతో ఒక బస్తాకు నాలుగు కిలోల నుండి 5 కిలోల వడ్లను దౌర్జన్యంగా రైతులను బెదిరిస్తూ తీస్తున్నారని సదరు రైస్ మిల్లర్ల ఓనర్లతో కుమ్మక్కైన ఐకెపి నిర్వాహకులు రైతులను మోసం చేస్తూ వస్తున్నారని ముఖ్యంగా టేకుమట్ల చిట్యాల మండలాలలోని రైస్ మిల్లర్ల యాజమానులు చెప్పిందే వేదంగా ఐకెపి సెంటర్ నిర్వాహకులు నడుచుకుంటున్నారని జిల్లా వ్యవసాయ సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడము వారి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట గిట్టుబాటు ధర బోనస్ లు వారు తీసే తరుగులోనే పోతుందని రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరుకు రావట్లేదని రైతులను ఇబ్బందుల గురి చేస్తూ వస్తున్నారని ఇట్టి విషయంపై జిల్లా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని అదేవిధంగా సీసీఎల్ పత్తి కొనుగోళ్ల విషయంలో కూడ ఇదే ధోరణి అవలంబిస్తున్న సంబంధిత నిర్వాహకులపై వెంటనే ప్రభుత్వం జిల్లా అధికారిక యంత్రంగా స్పందించాలని లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం వ్యవసాయ సంబంధిత డైరెక్టర్ కి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా అన్నారు
