ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.