
BRS Exposes Congress Unfulfilled Promises
కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం.
#బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
#కాంగ్రెస్ మోసాలను వెలుగులోకి తేవడమే బిఆర్ఎస్ లక్ష్యం.
#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి700 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని. రైతులు, కూలీలు,మహిళలు, యువకులు, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బాకీ కార్డుల ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసగించడంపై ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తామని. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ మోసం వెలుగులోకి తీసుకువచ్చి మండల, గ్రామస్థాయి నాయకులు బాకీ కార్డులను గ్రామాలలో విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులను బ్రహ్మస్త్రంగా వినియోగించుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే గ్రామాలలో రాజకీయ చైతన్యం పెంచి ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు పోగుల చిరంజీవి, ఇంగ్లీ శివాజీ, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల మోహన్ రెడ్డి, తిరుపతి, చేరాలుగౌడ్, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్ రెడ్డి, నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, ఖ్యాతం శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, శ్రీనివాస్, గుమ్మడి వేణు, వై నాలా మధు, పరికినవీన్, మేడిపల్లి రాజు గౌడ్, మురాల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.