బిఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

రౌడీలు గుండాలు మన నియోజకవర్గానికి అవసరమా

ఊసరవేల్లిలా రంగులు మారుస్తూ వస్తున్నారు జాగ్రత్త

వరంగల్ ప్రజలను వద్దని పోయినవాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, కారుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి
___ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో, వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఖిలా వరంగల్ పడమర కోట అమరవీరుల స్తూపం వద్ద స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్.
ఈ సందర్భంగా గులాబీ శ్రేణులతో దద్దరిల్లిన ఖిలా వరంగల్, జయహో నరేందర్ నినాదాలతో హోరెత్తిన ఖిలా కోట, కారు గుర్తుకే మన ఓటు అంటూ ఎమ్మెల్యే నరేందర్ కు ఘనస్వాగతం పలికిన గులాబీ శ్రేణులు, కార్యకర్తలు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మెట్టు దర్వాజ వద్ద ఎమ్మెల్యే నరేందర్ కి ఘనస్వాగతం పలికి పూలు చల్లుతూ, డబ్బు చప్పుళ్లతో ర్యాలీగా ఖిలా వరంగల్ అమరవీరుల స్తూపం వద్దకు చేరారు.


తదనంతరం అంబెడ్కర్ గారికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించి, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ, మనం ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగినం, మన స్థితిగతులు మనకు తెలుసు, ఏ సహాకారం అందిస్తే మన బతుకులు బాగుపడతాయి అనేది మనకు తెలుస్తుంది. కానీ, ఎక్కడి నుండో వచ్చే కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఎం తెలుస్తుంది అని అన్నారు.
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నుండి పోటీ చేసేవారు ఒకరు వర్ధన్నపేట, మరొకరు వంచనగిరి అని స్థానికేతరులకు మన గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు. నేను మేయర్ గా ఉన్నప్పుడు అన్ని కులలాకు కమ్యూనిటీ హాల్ నిర్మించాను. ప్రజల కనీస అవసరాలు కరెంట్ నీళ్లు, ఇంటి నెంబర్ రోడ్లు మోరీలు వేశాం, నాయకుడంటే ప్రాణాలు అడ్డం పెట్టి ప్రజలను కాపాడుకోవాలి కానీ, కరోనా సమయంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒకరు ఫామ్ హౌజ్ లో మరొకరు పౌల్ట్రీలో తలదాచుకున్నారు.
మన బాగుకోసం, భవిష్యత్తు కోసం కలెక్టరేట్, బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇన్నర్ రింగ్ రోడ్ 7 గురుకుల పాఠశాలలు, 24 అంతస్తుల హాస్పిటల్ ఇలా మరెన్నో అభివృద్ధి పనులు చేసాను. 77 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలకులు పరిపాలించారు, 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు, వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి నోచుకోకోకుండా చేశారు.


కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు, వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నారు, సౌభాగ్యాలక్ష్మీ ద్వారా 3వేల రూపాయలు అందిస్తాం అని, రైతులకు రైతుబంధు 16000వేలకు పెంచుతున్నాం అని, ఆరోగ్యశ్రీ ద్వారా 15లక్షల వైద్యం చేసుకునే వేసులు బాటు ఉందని, గ్యాస్ 400వందలకు అందిస్తాం,
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా అందిస్తాం అని అన్నారు. ఖిలా వరంగల్ ప్రజలంతా ఐక్యతగా ఉండి బొడ్రాయి, అమరవీరుల స్తూపం, అంబెడ్కర్, బతుకమ్మ తల్లి గొప్పగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రశాంతంగా ఉన్న ఓరుగల్లు రౌడీ గూండాయిజం ఉండకూడదు అంటే వారిని ప్రజలు తిరస్కరించాలి. కాంగ్రెస్ నుండి పోటీ చేసే వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు మన వరంగల్ వాళ్ళని పొగిడి, పరకాల పోయి వరంగల్ అత్తగారిల్లు, పరకాల అవ్వగారిల్లు అని, వరంగల్ పోయి తప్పు చేశానని అన్నారు. అంటే మనం అంత అంటరాని వాళ్ళమా అని ఆలోచించాలి.
కాళ్ళు మొక్కించుకొనే సంస్కృతి వాళ్ళది, మనం ఎంపని చేసిన మన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోము, అలాంటి వాళ్ళను మనం దరిదాపుల్లోకి రానివ్వద్దు అని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే అభివృద్ధి ఆగిపోతాయి, తెలంగాణ రౌడీ గుడాయిజం పెరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రణరంగంగా మారుతుంది అని అన్నారు. అందరం ఐక్యతగా ఉండి నవంబరు 30న కారు గుర్తుకు ఓటు వేద్దాం అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!