అందరూ అంచనాలు వేసేవారే! గెలుపోటముల లెక్కలు చెప్పేవారే!!

https://epaper.netidhatri.com/

తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల దృష్టి మళ్లించాలని రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. అలాంటి వారి ఆటలు ప్రజలే సాగనివ్వరు అంటున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,… నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రచార పర్వం గురించి వివరిస్తూ అనేక విషయాలు వెల్లడిరచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

` ప్రభుత్వ తప్పులు వెతికేవారే!

`ఎన్నికల ఫలితాలు ఊహించేవారే!

`ఆంద్రా నాయకుల సలహాలతో రాజకీయాలు చేసే వారే.

`సీమాంధ్ర మీడియాను పట్టుకొని వేళాడే వారే.

`తెలంగాణలో వుంటారు…మన బాష రాదు.. యాస రాదు.

`ఈ తెలంగాణ అంటుంటారు ద్రోహులు.

`మన తెలంగాణ అని ఒక్క బిఆర్‌ఎస్‌ నేతలే అంటారు.

`మన తెలంగాణ అనేందుకు ప్రతిపక్షాలలో ఒక్కడికీ నోరు రాదు. నాలుక తిరగదు.

`ఎన్నడైనా ఉద్యమం చేస్తే జై తెలంగాణ అనే వాళ్లు.

`మన తెలంగాణ అని సంబోదించే వాళ్లు.

`మన తెలంగాణ అని రేవంత్‌ రెడ్డి ఒక్కనాడు కూడా అనలేదు.

`ఏ కాంగ్రెస్‌ నాయకుడు అనడు.

`ఇప్పటికీ అదే ఆంధ్ర యాస..

`వీళ్లా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది.

`బీఆర్‌ఎస్‌ ను ఓడాలని ప్రతిపక్షాలు అనుకుంటే సరిపోదు..

`గత ఎన్నికలలో ఇలాగే కలలుగన్నారు.

`ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా, బిఆర్‌ఎస్‌ ను గెలిపించారు.

`ఇప్పుడు అదే జరుగుతుంది.

`బీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుంది.

 

ALSO READ: https://netidhatri.com/the-real-conspiracy-behind-jhansi-reddys-politicspolitics-is-the-way-to-ownership/

 

దేశంలోనే సంక్షేమ పాలన, సుసంపన్నమైన పాలన, ఆదర్శపాలన, ప్రజా పాలన ఒక్క తెలంగాణలోనే సాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు, ఎవరూ ఊహించని అనేక పథకాలు అమలౌతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే కాంగ్రెస్‌ పాలనలో అన్ని రకాలుగా కునారిల్లిన తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పాలనలో తెలంగాణ సుభిక్షమైంది. సుసంపన్నమైంది. సర్వతోముఖాభివృద్ది సాధించింది. అన్ని రంగాలలో గొప్ప పలితాలను విజయాలను చూస్తోంది. అసలు సాగుకే పనికి రాని భూములని చెప్పిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణ మొత్తం సాగులోకి తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. ఎవరైనా కల గన్నారా? అసలు తెలంగాణ వస్తుందని ఊహించారా? వచ్చిన తెలంగాణ లో బంగారు పంటల మాగాణ అవుతుందని అనుకున్నారా? తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీరుతాయనుకున్నామా? చెరువులకు పూర్వవైభవాన్ని చూస్తామనుకున్నామా? ఆ చెరువులే మళ్ళీ పల్లెకు జీవమౌతాయనుకున్నామా? ఎన్ని, ఎన్ని విజయాలు. అధ్భుతాలు. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలు. ఒకప్పుడు తెలంగాణలో భూముల ధరలు ఎలా వుండేవి. ఇప్పుడు ఎలా వున్నాయి. రైతుకు ఇన్ని రకాల సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనైనా అందుతున్నాయా? రైతు సంక్షేమం కళ్ల ముందు కనిపిస్తున్నా, తెలంగాణ రైతన్న సుఖశాంతులతో కాలం గడుపుతుంటే ప్రతిపక్షాలకు కంటకింపుగా వుంది. అందుకే రకరకాల కుట్రలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలను కలుషితం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల దృష్టి మళ్లించాలని రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. అలాంటి వారి ఆటలు ప్రజలే సాగనివ్వరు అంటున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,… నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రచార పర్వం గురించి వివరిస్తూ అనేక విషయాలు వెల్లడిరచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణలో జరిగే ఎన్నికలపై అందరూ లెక్కలు వేసేవారే తయారౌతున్నారు.
గెలుపోటముల లెక్కలు చెప్పేస్తున్నారు. ప్రతిపక్షాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు కొన్ని శక్తులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతం గురించి ప్రజలు మర్చిపోయారన్న భ్రమలో ప్రతిపక్షాలున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ప్రజలు పడిన బాధలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేదో అందరికీ తెలుసు. రైతన్నలకు ఇంకా బాగా తెలుసు. చిరు వ్యాపారులకు తెలుసు. పారిశ్రామిక వేత్తలకు తెలుసు. విద్యార్థులకు తెలుసు. పరీక్షల సమయంలోనైనా కనీసం రాత్రిపూట కరంటు ఇవ్వమంటే కూడా ఇవ్వని దుర్మార్గమైన పాలన కాంగ్రెస్‌ ది. ఆ రోజుల్లో విద్యార్థులు రాత్రి వేళల్లో చదువుకోవడానికి కరంటు లేక పడిన అవస్థలు చూస్తూ కూడా చేష్టలుడిగిన వాళ్లు కాంగ్రెస్‌ నాయకులు. ఆ చీకటి రోజులు వాళ్లు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. ఆ నాడు అన్ని గోసలు పెట్టిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పులు వెతుకుతున్నారు. ఎక్కడా ఏమీ లోపాలు కనిపించకపోవడంతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.
తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో తప్పులుంటాయా? లోపాలుంటాయా? లోపభూయిష్టమైన విధానాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న పార్టీ కాంగ్రెస్‌. వాళ్ల పాలనలో అన్నీ తప్పులే. అడుగడుగునా మోసాలే. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, కాంగ్రెస్‌ పార్టీకి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసినా తప్పుగానే తోస్తోంది. ఇప్పటికీ ఆంద్రా నాయకుల సలహాలతో రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ ను విమర్శించే నైతికత లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు ఎలాగు వెన్నెముక లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ నాయకులు స్వయం నిర్ణయం తీసుకోలేరు. వాళ్లు బిఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే బాసులు. కానీ కాంగ్రెస్‌ కు ఆంధ్ర ప్రదేశ్‌ నాయకులు, డిల్లీ పెద్దలే వారికి బాసులు. అందుకే కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ప్రజలకు జవాబుదారులుగా లేరు.
సీమాంధ్ర మీడియా ఏది చెబితే అదే పట్టుకొని వేళాడే కాంగ్రెస్‌ నాయకులు ఎప్పుడూ స్వయం నిర్ణయకారులు కాలేరు.
అసలు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు మన తెలంగాణ బాష రాదు.. యాస రాదు. ఎందుకంటే అన్ని విప్లవాలకన్నా సాంస్కృతిక విప్లవం గొప్పది. ఉమ్మడి రాష్ట్రంలో మన యాసను ఎంత కించపర్చేవారో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. సీమాంధ్ర యాసను తెచ్చి మన మీద రుద్ది, మన యాసను ఎగతాళి చేశారు. మన సంస్కృతిని కించ పర్చారు. మన పండుగలను చిన్న చూపు చూశారు. బతుకమ్మ ను వింతగా చూశారు. ఇలా అడుగడుగునా తెలంగాణను అవమానాలకు గురిచేశారు. ఆ వాసనలు ఇంకా కాంగ్రెస్‌ నాయకులలో పోలేదు. అందుకే ఇప్పటికీ కాంగ్రెస్‌ నాయకుల నోటి నుంచి మన తెలంగాణ అన్న పదం రాదు. ఈ తెలంగాణ అంటుంటారు. ఇలాంటి ద్రోహుల వల్లనే తెలంగాణ ఆగమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ అని అనలేని పిరికితనం నిండిన పరాన్న రాజకీయ చీడపురుగులు కాంగ్రెస్‌ నాయకులు. మన తెలంగాణ అని ప్రతి సారి గర్వంగా చెప్పుకునే వాళ్లు ఒక్క బిఆర్‌ఎస్‌ నేతలే. మన తెలంగాణ అనేందుకు ప్రతిపక్షాలలో ఒక్కడికీ నోరు రాదు. నాలుక తిరగదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏనాడు జై తెలంగాణ అనలేదు. మన తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నోరు మెదపలేదు. మా తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తారని నిలదీయలేదు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది ఒక్క బిఆర్‌ఎస్‌ పార్టీ నే. కాంగ్రెస్‌ నోటికి మన తెలంగాణ అన్న పదమే రాదు. ఎన్నడైనా ఉద్యమం చేస్తే జై తెలంగాణ, మన తెలంగాణ అనేవాళ్లు. మన తెలంగాణ అని రేవంత్‌ రెడ్డి ఒక్కనాడు కూడా అనలేదు. ఏ కాంగ్రెస్‌ నాయకుడు అనడు. ఇప్పటికీ అదే ఆంధ్ర యాస..
వీళ్లా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది. బిఆర్‌ఎస్‌ ను ఓడాలని ప్రతిపక్షాలు అనుకుంటే సరిపోదు..
గత ఎన్నికలలో ఇలాగే కాంగ్రెస్‌ నాయకులు కలలుగన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా,ప్రజలు తీర్పునిచ్చి బిఆర్‌ఎస్‌ ను గెలిపించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బిఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుంది. హాట్రిక్‌ సాధిస్తుంది.
కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే కర్ణాటక లో ఏం జరుగుతుందో అక్కడి ప్రజలే కాదు, నాయకులు కూడా చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హమీలలో రైతులకు ఏడు గంటల కరంటు మొదలు కాకముందే కోతలు పడ్డాయి. ఎన్నికలలో ఏడు గంటల కరంటు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇస్తున్నది ఐదు గంటలు. అందులోనూ కోతలే. రైతులకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదంటే వర్షాలు లేక కరంటు ఉత్పత్తి ఆగిపోయిందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అంటే రైతుల విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క విషయంలోనే అర్థమౌతోంది. రైతలకు అవసరమైన కరంటును ఎలా అందించాలో తెలియదు. అలాంటి వాళ్లను నమ్మితే తెలంగాణ లో పాత రోజులు వస్తాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రైతుబంధు పథకమే వృధా అంటాడు. ప్రజాధనం అనవసర ఖర్చు అంటాడు. రేవంత్‌ రెడ్డి రైతులకు మూడు గంటల కరంటు చాలంటాడు. ఇలాంటి నేతలను నమ్మితే మళ్ళీ చీకట్లు చూడడం తప్పదు. అయినా తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతమైనది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద ఎంతో నమ్మకంతో వుంది. కేవలం కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ కు న్యాయం చేయగలరు. తెలంగాణ ప్రజల సంక్షేమం కేసిఆర్‌ మాత్రమే చూస్తారు. పొరపాటున కూడా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మరు. ప్రచారంలో ఈ విషయం మాకు ప్రజలే స్పష్టంగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!