
#నాగజ్యోతి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలి
#మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
వెంకటాపూర్, నేటిధాత్రి:
ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలంలోని గుర్రంపేట గ్రామంలో ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మూడు మండలాల ఇంచార్జ్ సమ్మారావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడి లాగా పనిచేసి భారీ మెజార్టీతో బడే నాగజ్యోతిని గెలిపించాలని అన్నారు. ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి పార్టీ మేనిఫెస్టో వివరించాలని అన్నారు. అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమిష్టి కృషితో విజయ దుందుభి మోగించాలన్నారు. మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ప్రజలను మభ్యపెడుతూ అధికారం అనుభవించి దేశాన్ని వెనక్కి నెట్టింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి కుటుంబ పాలన పార్టీగానే కొనసాగుతుందని, కానీ నేడు బీఆర్ఎస్ పార్టీదే కుటుంబ పాలన అని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రెప్పపాటు కరెంటు పోతుందా ఒకప్పుడు విద్యుత్ సరిగ్గా లేక నిత్యం జనరేటర్లు నడిచేవి అని అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందించామన్నారు. గుర్రంపేట ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలం అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల సమన్వయ కమిటీ సభ్యులు గై అశోక్, ప్రసాద్ రెడ్డి, నడిగోట్టు సుదర్శన్, ఉమ్మడి సాంబయ్య, మందల శ్రీధర్ రెడ్డి, భాషవేణి జ్ఞానేందర్, ఎస్సీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు రామిండ్ల రాజేందర్, మాజీ ఎంపీపీ నర్సింగరావు, నరిగె రాజ్ కుమార్, స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు, యూత్ కమిటీ అధ్యక్షులు, 100 ఓట్ల ఇన్చార్జీలు, బూత్ కమిటీ ఇన్చార్జులు, సోషల్ మీడియా వారియర్స్, సీనియర్ నాయకులు, బూత్ ఏజెంట్లు, గ్రామ పార్టీ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.