ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
ఎండపల్లి మండల కేంద్రంలోని మడేలేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రజక సంఘం అధ్యక్షుడు నస్పూరి మల్లేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోనుగొటి శ్రీనివాస రావు (బాపు) ను కలసి విన్నవించగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సంఘ సభ్యుల కు బాపు అందజేశారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు పిఎస్అర్ (బాపు)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో,ఎండపల్లి రజక సంఘం అధ్యక్షుడు నస్పురీ మల్లేష్ ఉప అధ్యక్షుడు కాల్వ శoకరయ్య మరియు సబ్బ రాజేశం, కాల్వ రమేష్,కాల్వ మల్లయ్య, వర్ధవెల్లి శేంకర్,కాల్వ తిరుపతి, కాల్వ రాజయ్య, కాల్వ శ్రీకాంత్ పాల్గొన్నారు