కేటీఆర్‌కు సీట్ నోటీసులు.. డైవర్ట్ రాజకీయం
ఆధారాలు లేకుండా కేటీఆర్‌కు నోటీసు.. ఎందుకు…?
కెటిఆర్ సేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
కేటీఆర్‌కు సీట్ నోటీసులు ఇవ్వడం పై బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన చేయకుండా రాజకీయ కక్ష సాధింపులే చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. మొన్న హరీష్‌రావుకు, నేడు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం డైవర్ట్ పాలిటిక్స్ అని భరత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో సీట్ విచారణలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్‌కు, మున్సిపాలిటీ ఎన్నికల్లో హరీష్‌రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు.ఆధారాలు లేని కేసులు, కాలేశ్వరం ప్రాజెక్టు, ఈ-రేస్‌లో నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ ఎన్నికలను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్రాగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత కూడా రైతుభరోసా ఊసులు రాలేదని ఆయన ఆక్షేపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానాలు ఆధారాలు లేవని చెప్పినా, కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని భరత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి విదేశాల్లో విహరిస్తుండగా, పోలీసులు చెక్కర్లు కొట్టుకుంటున్నారని అన్నారు. రెండేళ్ల దర్యాప్తులో ఎలుక కూడా పట్టలేదని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు…
