
భవిష్యత్ బిఆర్ఎస్ దే..!
స్థానికఎన్నికల్లో బి ఆర్ఎస్ విజయ డంక మోగించాలి.
కేటీఆర్ సేనమండల పార్టీ అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్
మొగుళ్ళపల్లినేటి ధాత్రి:
బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనుటకై వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ మొగుళ్ళపల్లి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనుటకై రావడం తో సంతోషకరమని తెలిపారు కేటీఆర్ సేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలం చెందిందని. కావున రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టని అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేసిన కృషిని ప్రజలకు తెలియపరుస్తూ. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండలానికి చేసిన అభివృద్ధిని చూపెడుతూ స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అధికారం చేపట్టే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె పని చేయాలని ఆయన అన్నారు. మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు గారి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.