బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి
పరకాల మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి
పరకాల నేటిధాత్రి:
టిఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజలు తరలిరావాలని పరకాల మాజీ ఎంపీటీసీ,మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ, మోసపూరిత కాంగ్రెస్ చేతుల్లో పడి ఆగమైపోతున్నదని,వారి పాలనను ఎండగట్టి తెలంగాణను కాపాడుకునే దశలో ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా జనాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27న ప్రతి ఒక్కరు గులాబీ జెండాతో సభకు కదలాలని కోరారు.