బీఆర్‌ఎస్‌ దే హవా!

https://epaper.netidhatri.com/

మళ్ళీ పల్లెల్లో కారుదే జోరు.

కలవరపడుతున్న నేతల వల్లే బీఆర్‌ఎస్‌ నష్టపోయింది.

తమపై తాము నమ్మకం లేని వాళ్ల వల్లే ఓటమి పాలైంది.

వ్యతిరేక చానళ్ల అతి ప్రచారం నమ్మొద్దు.

ప్రజల నాడి తెలుసుకోవడంలో బీఆర్‌ఎస్‌ నేతలు విఫలం.

ఇప్పటికీ ప్రజల్లో బలంగా వున్నది కేసిఆరే.

పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ సీట్లు బీఆర్‌ఎస్‌ కే.

అనవసరమైన ఆలోచనలు చేయకండి.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.

మీడియాతో మాట్లాడేప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.

ఎవరో అసందర్భ ప్రేలాపనలు చేసే వారి మాటలు నమ్మకండి.

మీకు మీరే పార్టీని చెడగొట్టకండి.

కార్యకర్తలు బలంగా వున్నారు.

కష్టపడేందుకు శ్రేణులున్నాయి.

కార్యకర్తలకు దగ్గరకండి.

రైతులు, ప్రజలంతా కేసిఆర్‌ నే కోరుకుంటున్నారు.

సైలెంట్‌ ఓటింగ్‌ తో కాంగ్రెస్‌ కు షాక్‌ తప్పదు.

బీజేపికి చోటే లేదు.

ఓపిక లేని వాళ్లంతా ఒక దగ్గర చేర్చి నిలకడ ఆశించడం తప్పే అవుతుంది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో అదే జరుగుతుంది. బిఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలంటే నాయకులను చేర్చుకుంటే చాలనుకున్నారు. ఐనోడిని, కానోడిని చేర్చుకున్నారు. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతామని చెప్పినట్లే, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అందర్నీ కారెక్కించుకున్నారు. కాకపోతే అవకాశవాదులను దరి చేర్చుకున్నారు. వారికి రాజకీయ పదువులిచ్చి అక్కున చేర్చుకున్నారు. అయినావారి మనసులో కారులో లేదని తెలుసుకోలేకపోయారు. కేసిఆర్‌ అంటే విశ్వాసం లేద గ్రహించలేకపోయారు. కేవలం భయం వున్నట్లు నటించారు. పదవుల కోసం నాటకాలు ఆడారు. పదువులు లేకపోతే వుండలేక, పార్టీ అదికారంలో లేకపోతే నిలువలేక వెళ్లిపోతున్నారు. దాన్ని చూసి మిగతా నాయకులు ఎందుకు భయపడుతున్నారో అ ర్ధం కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌ నాయకుల విషయంలో ఏ తప్పు చేయలేదు. తెలంగాన అభివృద్దికి ఆటంకాలు కలుగొద్దన్న ఒకే ఒక్క కారణంలో వచ్చిన వారందరనీ దరి చేర్చుకున్నారు. వారికి కూడా ప్రాధాన్యత కల్పించారు. కాని దానిని వాళ్లు నిలుపుకోలేదు. వెళ్లేవారు వెళ్లనివ్వండి.
వెళ్లే వాళ్లు వెళితే కారు ఖాళీ అవుతుందనేది భ్రమ. ఎందుకంటే తెలంగాణలో ప్రతి విషయంలో కేసిఆర్‌ వుండారు. ప్రతి అంశంలో కేసిఆర్‌ కనిపిస్తారు. తెలంగాణ రైతు కళ్లలో వున్నది కేసిఆరే. తెలంగాణకు ముందు రైతు ఎలా గొస పడ్డాడో..కేసిఆర్‌ పాలనలో పదేళ్లలో ఎంత సుఖపడ్డారో అందరకీ తెలుసు. ఆసరా పించన్లు అందుకున్న పెద్దవాళ్లకు తెలుసు. కేసిఆర్‌ గురించి అర్ధం చేసుకోలేనిది కేవలం అవకాశవాదులే. వాళ్లకు తెలంగాణకు ప్రయోజనాల కన్నా, తమ వ్యక్తిగత రాజకీయాలే ప్రధానమయ్యాయి. వారికి వారి రాజకీయ భవిష్యతే ముఖ్యమైపోయింది. వాళ్లు త్యాగ ధనులు కాదు. త్యాగాల విలువ వారికి తెలియదు. అందుకే వెళ్తున్నారు. వాళ్లను చూసి ఇతరులు బెంబేలెత్తిపోవడం అన్నది సరైంది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే పిరికి వాళ్లే పార్టీలకు శాపం. వారు వున్నా, ఒక్కటే పోయినా ఒక్కటే. అవకాశవాదులు ఎప్పుడూ పార్టీలకు ప్రమాదమే..వాళ్లు ఎంత కాలం వున్నా పార్టీకి తీరని నష్టమే…వాళ్లంతా వ్యక్తిగత ప్రయోజనం కోసమే..అలాంటి వారిని చూపించి, వ్యతిరేక వర్గాలు కారు ఖాళీ అవుతుందంటారు. అది బిఆర్‌ఎస్‌ నేతలు నిజమని నమ్మడం కూడా వారి మూర్ఖత్వానికి నిదర్శం. ఎందుకంటే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు తెలంగాణకు దొరకరు. పదేళ్ల కాలంలో కేసిఆర్‌ ఏ ఎమ్మెల్యేను పిలిపించుకొని క్లాసులు పీకింది లేదు. వారిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనకేసుకొచ్చాడు. వారిని కాపాడుకుంటూ వచ్చారు. ఆరోపణలు, విమర్శలను పట్టించుకోకుండా పని చేసుకొండని చెప్పాడే..కాని ఏనాడు ఎమ్మెల్యేలను మందలించినట్లు వార్తలులేవు. అంతకన్నా మంచి నాయకుడు ఎవరుంటారు? ఆయన నాయకత్వంలో పదేళ్లపాటు సంపాదించుకోవాల్సిందంతా సంపాదించుకున్నారు. ఒకనాడు సైకిల్‌ కూడా సరిగ్గా లేని వాళ్లు కార్లు కొనుక్కున్నారు. స్ధలాలు కొనుకున్నారు. విల్లాలు కొనుక్కున్నవారున్నారు. ఇంకేం కావాలి…ఎల్లప్పుడు మాకే పదవులు కావలంటే ఎలా?
బిఆర్‌ఎస్‌ నేతలు. జనం ఏమనుకుంటున్నారో వినడం లేదు…కార్యకర్తలు చెప్పింది వినిపించుకోవడం లేదు. ఆరోపణలకు భయపడిపోతున్నారు. విమర్శలకు లొంగిపోతున్నారు. అధికారంలో వున్నప్పుడు ఎంతో తెగువ చూపించారు. కాని ప్రతిపక్షంలోకి రాగానే భయపడిపోతున్నారు. బెంబెలెత్తిపోతున్నారు? ప్రతిపక్షంలో వున్నప్పుడే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది. పని తనం తెలుస్తుంది. వారి అంకితభావం ఎంత గొప్పదో అర్దమౌతోంది. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ నాయకులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. పరనిందా ఆత్మస్ధుతి అంటే బిఆర్‌ఎస్‌ నాయకులకు తెలియక కాదు…అయినా నింద తమ మీద వుంచుకోలేక కేసిఆర్‌ను మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే కేసిఆర్‌కు వున్నంత ఆత్మస్ధైర్యం బిఆర్‌ఎస్‌ నాయకులకు లేదు. ఒకనాడు కేసిఆర్‌ ధైర్యమే వారికి రక్షగా వుంది. ఇప్పుడు కేసిఆర్‌ గుండె నిబ్బరం, బిఆర్‌ఎస్‌ నాయకుల్లో కనిపించడం లేదు. అందుకే బిఆర్‌ఎస్‌లో లుకలుకలు ఏర్పడుతున్నాయి. కేవలం కలవరపడుతున్న నేతల మూలంగానే బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. తెలంగాణ తెచ్చిన పార్టీ, పదేళ్లు పాలించిన పార్టీ, తెలంగాణలో వెలుగులు నింపిన బిఆర్‌ఎస్‌, ఓడిపోవడానికి ప్రధాన కారణం గత ఎమ్మెల్యేలే. కాంగ్రెస్‌ ప్రచారాన్ని నమ్మి నిండా మునిగారు. ప్రభుత్వాన్ని చేతిలో పెట్టేశారు. తాము చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయారు. సంపాదించుకున్న సొమ్మును ఖర్చు చేయడానికి ముందుకు రాలేదు. మూటలు విప్పలేదు. ఓడిపోతున్నామని ముందే నిర్ణయానికి వచ్చి, రూపాయి తీయలేదు. అసలు ఎలాంటి ఆర్ధిక మూలాలు లేని కాంగ్రెస్‌ నాయకులు ఎలా గెలిచారు? ఎంతో ఆర్ధిక స్ధితిలో వున్న బిఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు ఓడిపోయారు? ఒక్కమాటలో చెప్పాలంటే గెలుస్తామన్న నమ్మకం వారిలో వారికి లేకనే నిండా మునిగారు. తెలంగాణను అష్టకష్టాలు పెట్టిన పార్టీయే కాంగ్రెస్‌ ఫార్టీ. తెచ్చుకున్న తెలంగాణను విఫల తెలంగాణ అని చిత్రీకరించే చంద్రబాబు కుట్రకు రాజకీయంగా సహకరించిందే రేవంత్‌రెడ్డి. మరి తెలంగాణ ఆత్మగౌవరాన్ని బిఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారు? అంటే ధరణి పేరుతో ఇష్టాను సారం అవకతవకలు చేశారు. భూములన్నీ కొల్లగొట్టారు. ఆర్ధిక వనరులు సమీకరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో భూములు అమ్ముకున్న వాళ్లు కూడా ఎంతో మంది వున్నారు. అందువల్ల వారు కోల్పోయిన ఆర్దిక స్ధితిని సాధించుకోవాలనే కేసిఆర్‌ కోరుకున్నారు. కాని మాజీ ఎమ్మెల్యేలు అడ్డ దారులు తొక్కారు. ప్రజల భూములపై కన్నేశారు. అక్రమాలు చేశారు. అరాచకాలు చేశారు. పార్టీని భ్రష్టుపట్టించారు. పార్టీకోసం పని చేసింది తక్కువ. సంపాదనకు ఎగబడిరది ఎక్కువ. అందుకే బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రజలు ఓడిరచారు. అలాంటి వారిని కేసిఆర్‌ పక్కన పెడితే, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు. అయినా తన పార్టీ నాయకుల మీద అవినీతి ముద్రలు వేయడం ఇష్టం లేక కేసిఆర్‌ వారికి మరోసారి అవకాశమిచ్చారు. ఆ కృతజ్ఞత లేకుండా నాయకులు పార్టీలు మారుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన అసత్య ప్రచారమే ఇప్పుడూ చేస్తోంది. అయినా బిఆర్‌ఎస్‌ నాయకులకు సోయి రావడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలు చేసినవాళ్లే ఎక్కువగా వున్నారు. వాళ్లంతా నోరు మూసుకుంటున్నారు. ఇక అంతో ఇంతో విజ్ఞులు, మేదావులు అనుకున్న బిఆర్‌ఎస్‌ నాయకులు కూడా కేసిఆర్‌ తప్పు చేశాడంటూ మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులను కేసిఆర్‌ బిఆర్‌ఎస్‌లో కలుపుకోవడం తప్పు అని కారు పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంకోసం రాజకీయ పునరేకీకరణ అవసరం. కాని కాంగ్రెస్‌కు ఆ అవసరంలేదు. కాంగ్రెస్‌కు ఒక్క తెలంగాణ రాజకీయమే కాదు..దేశమంతా కావాలి. కాని బిఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ ప్రయోజనాలే కావాలి. తెలంగాణ ప్రగతికోసమే పనిచేసేది. తెలంగాణ అభివృద్దే బిఆర్‌ఎస్‌ ద్యేయం. తెలంగాణ కోసం కొట్లాడాలంటే బిఆర్‌ఎస్‌కే సాద్యం. తెలంగాణకు ఒక్క టిఎంసి నీళ్లు కావాలన్నా, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ, కర్నాకట కాంగ్రెస్‌ పార్టీ ముందు మోకరిల్లాలి. నీళ్ల కోసం కాంగ్రెస్‌ పోరాటం చేయదు. డిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి వుంటే వాళ్లకే మేలు జరుగుతుంది. కాని బిఆర్‌ఎస్‌ ఎంతదూరమైనా వెళ్తుంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది. కాంగ్రెస్‌కు ఆవవెసులుబాటు వుండదు. కేంద్ర పెద్దలు ఆ స్వేచ్ఛ ఇవ్వరు. ఇప్పటికైనా అర్ధం చేసుకోండి. తెలంగాణ పల్లెలో ప్రజలు కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులు కాంగ్రెస్‌నుశాపనార్ధలు పెడుతున్నారు. వాటిని వినండి. అప్పుడైనా మీలో మార్పు వస్తుంది. ఏసి రూముల్లో కూర్చొని, యూట్యూబ్‌ చానళ్ల సొల్లు వింటూ, అదే నిజమని నమ్మకండి. ఇప్పటికే కారును నిండా ముంచారు. ఇంకా ముంచకండి. పిలవని పేరంటానికి వెళ్లినట్లు ఆంధ్రా మీడియా చానళ్లకు వెళ్లి వెర్రి వెంగళప్పలు కాకండి. పార్టీని మరీ భజారుకీడ్చకండి. తెలంగాణలో కారు బాగానే వుంది. బిఆర్‌ఎస్‌ ఎంతోబలంగా వుంది. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్దానాలు గెలుస్తుంది. కేసిఆర్‌ నాయకత్వమే శాశ్వతంగా వుంటుంది. కాంగ్రెస్‌ గూడు ఎప్పుడు చెదురుతుందో తెలియదు. దానిని నమ్ముకొని రాజకీయాలు చేస్తే తల్లి లాంటి పార్టీకి తీరని ద్రోహం చేసినట్లే, గెలిచే సీట్లను పొగట్టుకున్నట్లే…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!