కన్వీనర్ల నియామకం
# యూత్ కన్వీనర్లుగా ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
# ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ కన్వీనర్లుగా టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి లను నియమించినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువతే కీలకమని పేర్కొన్నారు.పార్టీ అధిష్టానం మేరకు ఈ నియామకం జరిపి ప్రకటించినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శానబోయిన రాజ్ కుమార్ ప్రత్యేకంగా పర్యవేక్షించే దుగ్గొండి, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాలు కాగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించే మండలాలు ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ అని పేర్కొన్నారు. గ్రామాలలో ఉన్న యువతను సమన్వయ పర్చడoలో ఈ కన్వీనర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.