
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ చర్లకోలా. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రోజు మరణించిన వార్త తెలిసిందే, జడ్చర్ల నియోజకవర్గం లోని బీఆర్ఎస్ కార్యకర్తలు శోకసముద్రంలో మునిగిపోయారు. శనివారం రోజు, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతలక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు.అనంతరం వారి కుటుంబ సభ్యులను,మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ అధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.