గడపగడపకు విస్తృత ప్రచారం శాయంపేట నేటి దాత్రి:
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దూలం నాగరాజు ఆధ్వర్యంలో, మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో వున్నారని, మరోమారు కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపిన ఘనత గండ్రరమణారెడ్డిదే అని, భూపాలపల్లి నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి ఎంతో కృషి చేశారని, సంక్షేమం,అభివృద్ధి దిగ్విజయంగా కొనసాగాలంటే గండ్ర వెంకటరమణ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. శాయంపేట మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత గండ్ర దంపతులకు దక్కుతుందని అన్నారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ జయపాల్ రెడ్డి,,పార్టీ ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కర్రు ఆదిరెడ్డి,యలమంచి జయపాల్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మెన రమేష్, పంగ ఇంద్రయ్య, మాజీ సర్పంచ్ మాదారపు సమ్మయ్య, సురేంద్ర చారి, కోసరి రాజ కొమురయ్య, మోరే రాజయ్య, సాయిరెడ్డి, రాజయ్య రవీందర్రావు, తిరుపతి, ప్రకాష్, సమ్మిరెడ్డి, బత్తిని కుమార్, తిరుపతి గాజె కొమురయ్య, మాదారపు శీను, మాదారపు సురేష్, సతీష్ దైనంపల్లి రఘు, రవి, భూక్య శ్రీనివాస్, సదయ్య, పంగ అంబేద్కర్, వంశీ, మస్కె సాంబయ్య, పంగ సాంబయ్య, రాజు, నాగవెల్లి రత్నాకర్, నాగరాజు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.