ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య మాదిగ
భారాస టికెట్ బాబుమోహన్ లాంటి బఫూన్లకు ఇవ్వద్దు.
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాట యోధుడు, ఉస్మానియా విద్యార్థి పోరుకేరటం , తెలంగాణ రాష్ట్ర మాదిగల ప్రతినిధి వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలి.
హైదరాబాద్ నుండి వరంగల్ కి పాదయాత్ర చేసిన ఘనత , అసెంబ్లీ ముట్టడి లో అరెస్ట్ అయిన 9మందిలో వంగపల్లి కూడా ఉన్నాడు . నిరంతం మాదిగల అభివృద్ధికోసం పోరాడుతూ., అనేక సమస్యలపై పోరాటం చేస్తున్న వ్యక్తి వంగపల్లి శ్రీను మాదిగ జనాభా అధికంగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని వంగపల్లి శ్రీనివాస్ కి కేటాయించి పదేండ్లుగా బిఆర్ఎస్ పార్టీకి తన సహకారం అందించిన మాదిగలను ఏకం చేసిన వాడుకబట్టి వంగపల్లికి టికెట్ ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకానుండి పార్టీకి విధేయుడిగా ఉండి మాదిగలను ఏకం చేసిన క్రమశిక్షణ కలిగిన యువనాయకునికి భారాస టికెట్ ఇవ్వాలి.తన్నీరు హరీష్ రావు కడియం కాంగ్రెస్ లో చేరాడపై మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ స్థానంతోనే మొదలు పెట్టాలి.
సామాజిక తెలంగాణ లక్ష్యంగా అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తూ సాంఘిక సంక్షేమ యూనివర్సిటీ సాధనకోసం సైకిల్ యాత్ర రథసారధి
ఇలా అన్ని సామాజిక వర్గాల కు సుపరిచితమైన వంగపల్లి శ్రీనివాస్ కి బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి మేకల ఓంకార్ మాదిగ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శిలపాక హరీష్ మాదిగ భూపాలపల్లి మండల అధ్యక్షులు నేరుపాటి అశోక్ మాదిగ మండల ప్రధాన కార్యదర్శి పసుల కుమార్ మాదిగ ఉపాధ్యక్షులు పెరికబాబు మాదిగ, పాల్గొన్నారు