వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బొల్లారం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ గ్రామంలో గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే 13000, అదే మగ బిడ్డ పుడితే 12000 కానుకగా అందిస్తున్నారని, అంతేకాకుండా బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బొల్లారం గ్రామంలోని ఓ చిన్నారిని ముద్దాడి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. బి ఆర్ ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు.