BRS-BJP Merger and KTR Criticism in Telangana Politics
తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ బిజెపిలోవిలీనంబిఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం……
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పాత్రికేయుల ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ.బిఆర్ఎస్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభద్రత భావంతో మాటలు మాట్లాడుతున్నారు అని. ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమానికి కేటీఆర్ కూడుకున్నట్లు.కనిపిస్తుందని మీ క్యాడర్ ను. తప్పుడు విధానంతో ఉత్సాహ.పరచడానికితప్ప మరేం లేదని. మీరూ మీ ప్రభుత్వంలో .సర్పంచులకు. ప్రభుత్వపరంగా గ్రామాల్లో రోడ్లు గాని డ్రైనేజీలు గాని లైటింగ్స్ గాని ప్రభుత్వ పనులు చేసిన వారికి గాని పార్టీకి పనిచేసే వారికి కానీ నువ్వు ఎంతమందికైతే ప్రభుత్వపరంగా గ్రామాలలో పనులుఅప్పజెప్పినావోపూర్తి చేసిన తర్వాత వాళ్లకి బిల్లులు ఇప్పించకపోగాఅలా మీ పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి కనీసంటైంఇవ్వని నువ్వు నీ కింద పనిచేసే వ్యక్తిగత ఎవరైనా అనుకోవచ్చు వారు కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేరు ఆరోగ్యపరంగా పిల్లల పెద్దల ఆరోగ్య పరిస్థితి బాగోలేక మా ఎమ్మెల్యే ఉన్నాడు అని ధీమాతో వస్తే వారిని కనీసం నీ గేటు దాటనిచ్చావా నీ చుట్టుపక్కల ఉన్నవారు వారికి అన్ని హంగులు సదుపాయాలు అందలమెక్కించావు అప్పుడు వాళ్ళను పట్టించుకోని నీవు ఇప్పుడు. లీగల్ సెల్.. ఏర్పాటు చేయడం విడ్డూరమని. తెలంగాణలో గ్రామ సర్పంచులు గాని ఎంపిటిసిలు గాని మీ పార్టీ నాయకులు గ్రామాలలో ప్రభుత్వ పనులు చేపట్టి అయిపోయినా కూడా మీరు అధికారంలో ఉండి బిల్లులు ఇవ్వక ఇబ్బందిపెట్టినారని మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం యువకులను కానీ ప్రజా ప్రతినిధులను కానీ దగ్గరికి రానివ్వకుండా పట్టించుకున్న పాపాన పోలేదని. ఇప్పుడు అందరూ నా.వారునేను చెప్పినట్టు వింటారు అందరూ నా వెనకే ఉన్నారుఅనడం భ్రమలో మునిగితేలడంఅని. ఇప్పుడు ప్రజలకు ఏమో చేస్తాను అని చెప్పడం విడ్డూరంగా ఉందని. మీరు తలుచుకుంటే బిల్లులు రావడం పెద్ద విషయం ఏమీ కాదని మీరు మీ దగ్గర పని చేసేవారు ఏమి ఆశించి పనిచేయ లేదోమీ ప్రభుత్వ పనులు చేసిన వారందరికీ తెలుసునని ఇందులో నీ వ్యక్తిగత వారి పాత్ర చాలా బాగుందని. ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు కానీ దగ్గరికి రానివ్వలేదు. అలాగే .10. గ్రామపంచాయతీలలో.కాంగ్రెస్ విజయం.ప్రజాపాలనాకు నిదర్శనం అని. ప్రతి గ్రామంలో ఓటు బ్యాంకు పెరిగిందని. ఏ పార్టీ అభ్యర్థి గెలిచిన పల్లెల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారు. ఎవరు గెలిచినా పార్టీ పరంగా కాకుండా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు చెప్పుకోవడం కాదు అని అధికారంలో ఎవరు ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి పంపించడం ప్రభుత్వ ధ్యేయమని. కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద బురద చల్లే కుట్రలు కేటీ రామారావు చేస్తున్నాడని పల్లెలో పార్టీ కతం అవుతుందనే భావనతో కేటీఆర్ కొత్త.డ్రామాలకు తెరలేపుతున్నారని.ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇచ్చిన హామీలు అమలు చేయలేని మీరు మమ్మల్ని అడిగితే మీ పరిపాలనలో ఎన్ని హామీలు ఇచ్చినెరవేర్చ.లేదో. ప్రజలందరికీ తెలుసునని. తెలంగాణ యాస భాష సెంటిమెంటు వాడుకుని ఎవరు. ఎంతదోచుకున్నారో ప్రజలందరికీ తెలుసునని అలాగే మొదటి విడత రెండో విడతల ఫలితాల. గానే మూడో విడత ఫలితాలు రాబోతున్నాయని. అలాగే మూడో విడత పూర్తి కాకముందే హుటాహుటిన అభినందన సభ పెట్టడం దేనికి అని. సర్పంచులు ఆత్మహత్యలకు కారణమైన కేటీఆర్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు అని కేటీఆర్ కోటకు బీటలు పడుతున్నాయని. ముందు రాబోయే కాలంలో బిజెపి బిఆర్ఎస్.పార్టీలు విలీనం కాబోతున్నాయని.ఈ పాత్రికేయుల సమావేశంలో తెలియజేయడం పాటు రాజకీయం ఎవరైనా చేయొచ్చు కానీ అబండాలు అబద్ధాలు మాట్లాడే ముందు జనాలు ఉన్నారు అని ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి పాత్రికేయుల సమావేశంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరుశురాం. జిల్లా నాయకులు లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కటకం రాజశేఖర్. గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్.మునిగలరాజు.సుద్దాల శ్రీనివాస్. మీరాలభాస్కర్. ఎగుర్లప్రశాంత్. గుగ్గిల భరత్. ప్రశాంత్. కే మనోజ్ రెడ్డి. పయ్యావుల శ్రీను. బండి పరశురాం. ఎల్లారెడ్డి. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
