
BRS party leaders
అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..
#పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
#చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై దుష్ప్రచారం.
#మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినారని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రామల అభివృద్ధిని మేమే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని బిఆర్ఎస్ మండల నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. శనివారం మండలంలోని నారక్కపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని గాలికి వదిలేసి వారు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఇల్లు లేని పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, దళితులకు దళిత బంధు ఇస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ తో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చేతి గుర్తుపై గెలిచి ఎంపీపీగా గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అర్హత భానోత్ సారంగపాణి కు లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తూ పేదల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుందని దానికి నిదర్శనమే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీలేని రుణాలు, కుల సంఘాలకు భవనాలు, మహిళా సంఘాలకు భవనాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పేదవాడికి సన్న బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పబ్బంగడుపుతున్నారని. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇవేమీ ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మేము చేపట్టిన అభివృద్ధి పనులను నిరూపించడానికి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా దమ్ముంటే రండి ఇప్పటికైనా ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలను మానుకోండి లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు .ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు అడపరాజు, ప్రధాన కార్యదర్శి వక్కల యోగేశ్వర్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య నాయకులు కోడూరు రాయ సాబ్, పాక కుమారస్వామి, అడిగిచెర్ల శ్రీనివాస్ ,కుంచాల రాజు, చిందం కుమారస్వామి, మెరుగు మల్లయ్య, వైనాల మొగిలి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.