
రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని మంజునగర్ లో కూరాకుల ఓదెలు లలిత రైతులు తమకు ఉండబడిన రెండు గుంటల భూమిలో బర్ల కోసం ఒక రేకుల షెడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది దానిని కూల్చాలని మున్సిపల్ అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని నోటీసులు ఇచ్చారు
మా సొంత భూమిలో సిసి రోడ్ నిర్మాణం ఎలా చేపడుతారని సదరు రైతులు అధికారులను ప్రశ్నించారు దీంతో ఆగ్రహించిన మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది పెద్ద మొత్తంలో వచ్చి బర్ల కోసం వేసుకున్న రేకుల షెడ్డు ను జెసిపి తో కూల్చి వేసిన మున్సిపల్ అండ్ పోలీస్ అధికారులు ఆగ్రహానికి గురైన రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమకు ఉండబడిన బర్లను తోలి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారిపై పోలీసులు కేసులు పెట్టారు దీంతో తమపై పెట్టిన కేసులను ఎత్తివేసి మాకు బర్ల కోసం వేసుకున్న రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డుపై రైతులు ధర్నా చేశారు వీరికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి కూరాకుల ఓదెలు లలిత అనే రైతులకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు