
ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరాకుల ఓదెలు లలిత అనే రైతుకు ఉండబడిన భూమిలో బర్ల షెడ్డు వేసుకోవడం జరిగింది రోడ్డుపై వేసిన బర్ల రేకుల షెడ్డును తొలగించాలని సీసీ రోడ్డు నిర్మాణం కోసం వారికి నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు కానీ నెల రోజులైనా స్పందించని రైతులు మునిసిపల్ అధికారులు బర్ల షెడ్డును కూల్చారు కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. వారు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తమకు ఉండబడిన బర్లను తోలి నిరసన వ్యక్త చేయడం ఏమైన చర్య ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నాడని మాకు అనుమానం వ్యక్తం చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటి పనులను ప్రోత్సహిస్తూ వెనక ఉండి నడిపిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే గండ్రను విమర్శించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య అప్పం కిషన్ పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ జంబోజు పద్మ ఉడుత మహేందర్ బౌత్ విజయ్ తోట రంజిత్ రేణుక తదితరులు పాల్గొన్నారు