మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్/నేటి ధాత్రి
ప్రమాదవశాత్తూ మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పార్టీ ప్రమాద బీమా కింద రూ.1 లక్ష చెక్కులను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తిమ్మాజీపేట గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కదిరే పాండు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, అమ్మపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సంక బాలరాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, బిజినేపల్లి మండలంలోని కార్కొండ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బొట్క భీముడు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మరణించడంతో వారికి పార్టీ ప్రమాద బీమా పథకం కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షల చెక్కులను అందజేశామన్నారు.
పార్టీల మనుగడ పార్టీ కార్యకర్తల మీద ఆధార పడి ఉంటుందని, ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కెసిఆర్ పార్టీ కార్యకర్తలకు మిగతా ఏ పార్టీలకు లేని విధంగా భీమా సదుపాయం కల్పించారన్నారు.
వారి ప్రీమియంను కూడా పార్టీ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. పార్టీ కోసం పని చేసే వారికీ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.