
రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత
ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో లేదు
మళ్లీ సారె కావాలి, మళ్లీ కారు ఏ కావాలి అంటున్న రైతన్నలు
యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మరిపెడ నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ఆర్ అండ్ బీ అతిధి గృహం ముందు వరంగల్, ఖమ్మం హైవే పై రైతన్నలు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిస్ రెడ్యానాయక్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులతో కలిసి వర్షంన్ని సైతo లెక్క చేయకుండా ధర్నాకు దిగారు, సకాలంలో రైతులకు యూరియా అందడం లేదని ఫైర్ అయ్యారు.యూరియా కొరత ఉందని పడిగాపులు గాసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నికి చలనం లేదు అన్నారు, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఎక్కడ లేదు అన్నారు, సకాలంలో పంటలకు యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అని, ఐన కూడా రాష్ట్ర ప్రభుత్వo నిర్లక్ష్య వైఖరినీ అవలంభిస్తున్నది అన్నారు, పంట నష్టపోయిన ప్రతి రైతాంగన్ని ఆదుకొని, ప్రతి రైతు కు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడింది అన్నారు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే మరిపెడ మండలానికి 5 వేల టన్నుల యూరియాను సరఫరా చేయాలన్నారు,యూరియాను సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు,కేసీఆర్ హయాంలో కూడా యూరియా ఇవ్వడానికి కేంద్రం సహకరించలేదనీ, ఐన ముందు చూపుతో నా తెలంగాణ రైతన్న లు యూరియ కోసం,ఎరువుల కోసం తిప్పలు పడవద్దు అని, రైతన్నలు అప్పుల పాలు కావద్దు అని ఏ సీజన్ కు ఆ సీజన్ లోనే రైతు బంధు డబ్బులు ఇచ్చే వారు అన్నారు, ఇది ముందే గ్రహించిన కేసీఆర్ రెండు నెలల ముందే యూరియా బస్తాలను తీసుకువచ్చి గోడౌన్లలో నిలువ చేశారన్నారు,తెలంగాణను దోచుకోవడానికే వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఎరువుల బస్తాలు అందించలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండి పడ్డారు. ప్రజా పాలన తెచ్చిన మార్పు ఇదేనా అన్నారు, ప్రజలు మార్పు మార్పు అంటే రైతన్న ను అగం చేసే మార్పు వస్తాది అనుకోలేదు అన్నారు, మళ్లీ సారే కావాలి, కారు ఏ రావాలి అంటున్న రైతన్న లు,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేసిన తప్పు ని ప్రజలు మరోసారి పునరావృతం కావద్దు అని,కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పుతరు అన్నారు,బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర,బీఆర్ఎస్ మండల నాయకులు రాంబాబు, రవీందర్, కాలు నాయక్,మాజీ ఎంపిపి గడ్డం వెంకన్న,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, చిన్న గూడూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మండల నాయకులు తాళ్ళపల్లి శ్రీనివాస్,ప్రవీణ్ రెడ్డి,లతీఫ్, తాళ్లపల్లి రఘురాం,కొమ్ము చంద్రశేఖర్,కొమ్ము నరేష్,అజ్మీర రెడ్డి, దుస్సా నర్సయ్య,గంధసిరి కృష్ణ, బాలాజి,రెండు మండల ల మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,రైతులు, యువకులు పాల్గొన్నారు.