
స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.
బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు.
కాశీబుగ్గ నేటిధాత్రి
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు మండలంలోని ఆగ్రాంపాడ్,లింగమడుగుపల్లె గ్రామాల్లో గ్రామకమిటీ అధ్యక్షులు శీలం సాంబయ్య, డుకిరే నాగేశ్వరరావు అధ్యక్షతన,మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనులు,సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో మట్టి అమ్ముకుంటున్నారని,దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మాజీ ఏ ఏం సి చైర్మన్లు బొళ్లబోయిన రవియాదవ్,కాంతాల కేశవరెడ్డి,సర్పంచ్ ల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షుడు సావురే రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని వంశీగౌడ్, రెండు గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.