ప్రత్యర్థులను చిత్తు చేసిన సంకేపల్లి అన్న–చెల్లెలు
నేటిధాత్రి, శంకర్ పల్లి :
శంకర్ పల్లి మండల పరిధిలోని
సంకేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి ఉప్పరి రవీందర్ సాగర్, 6వ వార్డు నుంచి ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సాగర్ ఉపసర్పంచులుగా ఘన విజయం సాధించారు. అబద్ధ ప్రచారాలు, అడ్డంకులు ప్రభావం చూపలేకపోయాయి. ప్రజల నమ్మకం, గ్రామ అభివృద్ధి నిబద్ధతే విజయ కారణం.
గ్రామస్తులు ఇది ప్రజల గెలుపు, ఐక్యతకు–నిజాయితీకు వేసిన ఓటు అని అభిప్రాయపడుతున్నారు. అన్న–చెల్లెలు బాధ్యతలను నిజాయితీగా నిర్వహించి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు
