బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …
జహీరాబాద్ నేటి ధాత్రి:
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
