కార్యకర్త కుటుంబానికి అండగా బి.ఆర్.ఎస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన మంథని రాజేంద్రప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ముత్తారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నూనె కుమార్ పేర్కొన్నారు.అనంతరం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంథని రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని ప్రభుత్వం తరపున ఎంపికైన గృహలక్ష్మీ పథకం ను వారి కుటుంబానికి అందజేస్తామని సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు నూనె కుమార్ తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్న బాలు వార్డు సభ్యులు చుంచు రమేష్ ఇంకా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ,యూత్ అధ్యక్షుడు మంథని సతీష్, సీనియర్ నాయకులు చొప్పరి శివయ్య,కల్వచర్ల ,మోగిలి,జగన్,సారయ్య, చిందం సదానందం బండి రాజు,ఇంకా కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!