
BRS Leaders Protest Against Congress Remarks in Chityal
మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .
చిట్యాల, నేటిధాత్రి :
అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.